ముంబైలో సైబర్ నేరాలు 700 శాతం పెరిగాయి

ముంబైలో సైబర్ నేరాలు 700 శాతం పెరిగాయి

Mumbai Cyber Crime:2024లో ముంబైలో సైబర్ నేరాలు భారీగా పెరిగాయి. గతేడాది ఇదే సమయంలో జరిగిన నేరాలతో పోల్చితే  పెట్టుబడుల పేరుతో సైబర్ మోసాలు దాదాపు 700 శాతం పెరిగాయని గణాంకాలు చెపుతున్నాయి. 

గణాంకాల ప్రకారం.. 2024 జనవరి నుంచి మే వరకు  ఎఫ్ ఐఆర్ నమోదు అయిన 355 కేసులు పెట్టుబడుల పేరుతో మోసాలకు పాల్పడినవే.. వీటిలో 76 కేసులను పరిశోధించడం జరిగింది. ఈ కేసుల్లో 91 మందిని అరెస్ట్ చేశారు. గతేడాది 42 సైబర్ ఇన్వెస్ట్ మెంట్ నైరాలు జరగ్గా.. 6 కేసులను పరిష్కరించారు. 20 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేశారు. 

స్కామర్లు మొదట సోషల్ మీడియాలో ఇన్వెస్ట్ మెంట్ స్కీం లను ప్రచారం చేస్తారు. స్టాక్ ట్రేడింగ్ పై సమాచారాన్ని అందిస్తుంటారు. ఆ తర్వాత వాట్సాప్ గ్రూప్ లో చేరమని చెప్తారు. బోగస్ ట్రేడింగ్ అప్లికేషన్లను డౌన్ లోడ్ చేసుకోవాలని స్టాక్ మార్కెట్ లో డబ్బు పెట్టుబడి పెట్టాలని ఒత్తిడి తెస్తారు. పెట్టుబడి రూపంలో సైబర్ నేరగాళ్ల ఖాతాలకు డబ్బులను పంపేలా ప్రేరేపిస్తారు. మొదట కొంత లాభం వచ్చినట్లు చూపించి ఇన్వెస్టర్ల ఖాతాలకు డబ్బులు పంపుతారు. 

డబ్బులు డ్రా చేసుకోవాలంటే..మరింత డబ్బును చెల్లించాలని డిమాండ్ చేస్తారని మోసం పోయామని తెలుసుకున్నా బాధితులను విచారించినప్పుడు తేలిందని పోలీసులు చెపుతున్నారు.